ANIL CS RAO
  • ABOUT
  • PRESS
  • PAST EXHIBITS AND INVITATIONS
  • WORK-IN-PROGRESS (ENGLISH)
  • పని పురోగతిలో ఉంది (తెలుగు)
  • Work-In-Progress : Vizag Blue
  • ComicCons : FHM (INDIA) TOP 17 COMICS OF 2012
  • Rainbow FM Hyderabad
  • "Bonfire of Convention" : my first public exhibit 2005
  • Montgomery County, Maryland Gazette 2009
  • August 15, 2008 India Abroad
  • MFA Thesis Novel : BHARATHI
  • Film Project 2003
  • Debonair Magazine 2005 2006
  • My Poetry Work
  • ARTWORK FOR PURCHASE : PHYSICAL & NFTS
  • CVH RAO BOOK
  • Late Dad: Dr CVG Krishna Rao MD FACR
ది కాంట్రాక్టర్ & ది ఇంజనీర్

ఇది న్యూయార్క్ లోని మాన్హాటన్ లో నివసిస్తూ అక్కడే పనిచేసుకుంటున్న ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసుగల భారతీయ ఇంజనీర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. అతను మూడు వారాలు సెలవు తీసుకొని భారతదేశంలోని తన సొంత ఊరు అయినా వైజాగ్ కు వెళ్తాడు - అక్కడ అతను ఊహించని విధంగా పెళ్లి చేసుకుని - ఒక వివాహిత వ్యక్తిగా అమెరికాకు తిరిగి వస్తాడు.

"ఇంజనీర్" ఆనంద్ ని పెళ్లికి ముందు ఒక షరతుగా వివాహపూర్వ ఒప్పందంపై సంతకం చేయమని తన కాబోయే భార్య అడుగుతుంది- ఆనంద్ లేదా అతని కొత్త భర్తగా - అలా ఆ "కాంట్రాక్టర్" మిగతా ప్రశ్నలు అడగకుండా వివాహాన్ని రద్దు చేయటానికి అవకాశం ఉంది.

ఆనంద్ దగ్గరకు వెళ్ళటానికి తన ట్రావెల్ పేపర్ల కోసం రూప భారతదేశంలోనే ఉండగా, ఆనంద్ తన బైసెక్సువల్ ఫ్రెండ్ అయిన ప్రిన్నీ అలవితో రొమాన్స్ మొదలు పెడతాడు, ఎవరైతే తన పెళ్లికి ముందు పక్క బిల్డింగ్ లో నివసిస్తూ ఉందో. ఇంగ్లి
ష్ మరియు తెలుగులో ఆవిష్కరించనున్నారు.



రూప చివరికి ఆనంద్ తో కలిసి ఉండటానికి మాన్హాటన్ చేరుకుంటుంది. వైజాగ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ లోని జెఎఫ్ కె కు వెళ్ళే ప్రయాణపు చివరి దశలో ఆమె ఒక యువ కూచిపూడి నృత్యకారిణి మరియు పిహెచ్ డి గ్రహీత అయిన ఒక అమ్మాయితో స్నేహం చేస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అభ్యర్థి ప్రోతిమా నారాయణ్ ఎన్వైయూకు చెందిన టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఒక నెల వర్క్ షాప్ కోసం వస్తుంది. ఒక నెలలో, ప్రొతిమా మాన్హాటన్ లో ఉంటుంది-వెస్ట్ విలేజ్ లోని ఆనంద్ మరియు రూప యొక్క అపార్ట్ మెంట్ నుండి కేవలం 10 నిమిషాల నడక సమయం మాత్రమే ఉంటుంది- ప్రొతిమాకు రూప వివాహంలో ఒక రకమైన అసంతృప్తి ఉన్నట్లు కనిపెడుతుంది- ఆనంద్ రోజులో ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉంటున్నట్టు అపార్ట్ మెంట్ కు తిరిగి వచ్చిన తరువాత మాట్లాడకుండా అలిసిపోయినట్టు కనిపిస్తాడు. ఆనంద్ తో కాకుండా ప్రొతిమా సహాయంతో రూపా మాన్హాటన్ యొక్క ప్రామాణిక దృశ్యాలు మరియు దాగిఉన్న అందాలను రోజూ తిరగటం ద్వారా తెలుసుకుంటుంది. సెంట్రల్ పార్క్ లో నడుస్తూ అన్నిటినీ తెలుసుకుంటుంది. ఇది గ్రీన్ లో ప్రసిద్ధ మైలురాయి టావెర్న్ దగ్గర ఒక బ్రంచ్ తో ముగుస్తుంది.

Picture



LINK NYKDAILY
LINK LA WEEKLY
ప్రొతిమా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరిన తరువాత- రూప బ్రూక్లిన్ లోని ప్రాట్ ఇనిస్టిట్యూట్ లో ఎంఎఫ్ఎ(MFA) ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్ లో చేరుతుంది, వైజాగ్ లో ఉన్నప్పుడు ఆమెను దీనిలోకి అంగీకరించారు. బాంబేలోని జేజే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ అయిన సునీల్ ఘన్షాని అనే తోటి విద్యార్థితో ఆమె ప్రేమలో పడుతుంది.

వైజాగ్ లో పెళ్లి జరిగి ఏడాదిన్నర అయినా తర్వాత - ఆనంద్, రూపా పెళ్లి సమస్యలను ఎదురుకుంటుంది - కానీ చివరికి ప్రొతిమా డబ్బు మరియు బంగారం కోసం రూప వైవాహిక వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుందని తెలుస్తుంది...


జరిగేది అందరికీ అర్ధం అయ్యింది, పుస్తకాలలో, సినిమాలలో మరియు మీడియాలో ప్రదర్శించబడిన ఇతర కథనాలలో అసంఖ్యాకమైన మార్పులు మరియు కలయికలలో ఈ కథ రచించబడింది.

తన మునుపటి గ్రాఫిక్ నవలా రచనకు భిన్నంగా రచన మరియు కళాకృతులు నాణ్యత సమస్యల గురించి వివరణాత్మక పరిశీలనలో ఉన్నాయని రావు గారు ఇందులో పేర్కొన్నారు - ముఖ్యంగా 3 డి అప్లికేషన్ డాజ్ స్టూడియో(3D Application Daz Studఇఓ) మరియు జిఐఎంపి(GIMP) సాఫ్ట్ వేర్ ద్వారా రావు యొక్క దృష్టిని సమర్థవంతంగా అనువదించగలిగారు (ఈ రెండూ వెబ్ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి). రావు గారు వ్యక్తిగత ప్యానెల్స్ లో ఈ కథనాన్ని ఇలాంటి పేజీ లేఅవుట్లలో అందించాలని అనుకున్నారు. సాఫ్ట్ వేర్ యొక్క పరిమితుల కారణంగా దీనిలో ఎటువంటి రాజీలు పడలేదు - మరియు రావు గారికి ఫ్రీహ్యాండ్ ఇలస్ట్రేషన్ లేదా పెయింటింగ్ స్కిల్స్ కూడా లేవు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోండి: ఇందులోని ప్రతి పని మౌస్ మరియు కీబోర్డును ఉపయోగించే చేయబడింది.
పెళ్లి మరియు సంబంధాలకు సంబంధించిన సమస్యలను ఒక ప్రత్యేకమైన క్రాస్-కల్చరల్ కథనం నుండి ప్రస్తావించి, కామిక్ పుస్తక రూపంలో మొదటి కథనాన్ని సమర్పించాలని తాను భావిస్తున్నట్లు రావు గారు పేర్కొన్నారు. న్యూయార్క్ మరియు భారతదేశంలోని వేసవి సెలవుల్లో రావు గారి స్వంత విద్యార్థి దశ జ్ఞాపకాల ఆధారంగా ఈ "ది కాంట్రాక్టర్ & ది ఇంజనీర్" కథనాన్ని రూపొందించటం జరిగింది.
హైటెక్ సిటీలో సంవత్సరానికి రెండు సార్లు జరిగే హైదరాబాద్ కామిక్ కాన్ లో "ది కాంట్రాక్టర్ & ది ఇంజనీర్" ను ఇంగ్లిష్ మరియు తెలుగులో ఆవిష్కరించనున్నారు.


(అనువదించినవారు - పి. షామియా ఖాన్  shamiyapattan@gmail.com  +91 6281289448) pH.no: 6281289448
  • ABOUT
  • PRESS
  • PAST EXHIBITS AND INVITATIONS
  • WORK-IN-PROGRESS (ENGLISH)
  • పని పురోగతిలో ఉంది (తెలుగు)
  • Work-In-Progress : Vizag Blue
  • ComicCons : FHM (INDIA) TOP 17 COMICS OF 2012
  • Rainbow FM Hyderabad
  • "Bonfire of Convention" : my first public exhibit 2005
  • Montgomery County, Maryland Gazette 2009
  • August 15, 2008 India Abroad
  • MFA Thesis Novel : BHARATHI
  • Film Project 2003
  • Debonair Magazine 2005 2006
  • My Poetry Work
  • ARTWORK FOR PURCHASE : PHYSICAL & NFTS
  • CVH RAO BOOK
  • Late Dad: Dr CVG Krishna Rao MD FACR